తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
తెలంగాణా సీఎం కేసీఆర్ తెలంగాణాలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చని ఇటీవల తెలంగాణాలో జరిగిన ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ సీఎం కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఏపీలోని అచ్యుతాపురం వస్తే కేసీఆర్కు భూముల ధరలు ఎలా ఉన్నాయో తెలుస్తాయన్నారు. కాగా అచ్యుతాపురంలో ఒక్క ఎకరం అమ్మితే తెలంగాణాలో 150 ఎకరాలు కొనవచ్చు అన్నారు. తెలంగాణా రాజధాని హైదరాబాద్లోని ధరలే రాష్ట్రమంతా ఉన్నాయనుకోవడం అమాయకత్వం అని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయని పక్క రాష్ట్రాన్ని కించపరచకూడదని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు. తెలంగాణా సీఎం కేసీఆర్ మాట్లాడే ముందు ఏపీలోని అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.