హిట్‌మ్యాన్ క్రికెట్ ఎంట్రీకి నేటితో 16 ఏళ్లు
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయింది. కాగా రోహిత్ శర్మ 2007 జూన్ 23 న ఐర్లాండ్‌పై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా రోహిత్ ఇప్పటివరకు 441 మ్యాచుల్లో 17,115 పరుగులు చేశాడు. వీటిల్లో మొత్తం 43 సెంచరీలు ,91 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264గా ఉంది. రోహిత్ శర్మ వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 2018లో జరిగిన ఆసియా కప్ లీగ్‌లో రోహిత్ శర్మ టీమ్ఇండియాకు సారధ్యం వహించి ఇండియా ఆసియా కప్ గెలిచేలా కృషి చేశాడు. రోహిత్ శర్మ IPLలో కూడా సత్తా చాటి 5 IPL ట్రోఫీలను సాధించాడు.