Home Page SliderNational

అల్లు అర్జున్ వాయిస్ ఇమిటేట్ చేసి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ తమ్ముడు

టాలీవుడ్ హీరోయిన్ నివేద థామస్,ఆమె తమ్ముడు నిఖిల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. కాగా లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ..కొత్త డ్యాన్స్ రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. అయితే అదే వారి కొంప ముంచిందని చెప్పాలి. తాజాగా నివేద తమ్ముడు నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒకరు అల్లు అర్జున్ డైలాగ్ తెలుగులో చెప్పాలని కోరారు. ఈ క్రమంలోనే నిఖిల్ దేశముదురు సినిమాలో బన్నీ వాయిస్‌ ఇలా ఉందంటూ చేస్తోన్న రీల్ వీడియో చూశానని చెప్పారు. అంతేకాకుండా బన్నీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు నిఖిల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.