Home Page SliderInternational

ప్రముఖ హాలీవుడ్ హీరో దుర్మరణం

ప్రముఖ హాలీవుడ్ హీరో ‘ట్రీట్ విలియమ్స్’ రోడ్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.ఆయన 50 ఏళ్లుగా ఎన్నో చిత్రాలలో నటించారు. వందల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొలరాడోలో బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. హుటాహుటిన ఆయనను  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఆయన సూపర్ హిట్ సినిమా ‘Hair’ లో నటించారు. దీనితో పాటు టీవీ సిరీస్ ‘Everwood’ అనే సూపర్ హిట్ సిరీస్‌లో కూడా నటించారు. ‘Deadly hero’ అనే చిత్రంతో తన పోలీస్ ఆఫీసర్‌గా 1975లో తన చిత్ర కెరీర్‌ను మొదలు పెట్టారు విలియమ్స్. ‘ది ఈగల్ హాజ్ ల్యాండెడ్’, ‘ప్రిన్స్ ఆఫ్ ది సిటీ’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ అమెరికా’ అనే చిత్రాలలో నటించారు విలియమ్స్. వీటితో పాటు 120 కి పైగా టీవీ సిరీస్‌లో నటించారు. ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఆయన గొప్ప నటుడని, యువతరానికి రోల్ మోడల్ అని సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.