హైదరాబాద్‌లో కోట్ల విలువ చేసే గంజాయి లభ్యం
హైదరాబాద్‌లో పెద్దపెట్టున గంజాయి లభ్యం అయ్యింది. తెలంగాణా పోలీసులు, SOT పోలీసులు జాయింట్‌గా చేసిన ఈ దాడులలో 2.8 కోట్ల రూపాయల విలువ గల గంజాయి లభ్యం అయ్యింది. బాలానగర్, శంషాబాద్,మాదాపూర్, చందానగర్ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒడిశా నుండి తెలంగాణా మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నారు. ఈ దాడులలో 910 కేజీల గంజాయి వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో 8 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరు తెలంగాణా, మహారాష్ట్ర, హరియాణా, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. తెలంగాణా పోలీసులు చందానగర్, శంషాబాద్, బాలానగర్, రాజేంద్రనగర్, మాదాపూర్ మొదలైన ప్రాంతాలలో మెరుపుదాడులు చేసి దాదాపు 910 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాజుల పెట్టెలలో అడుగున గంజాయి బస్తాలు పెట్టి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనివిలువ 2.8 కోట్లు రూపాయల విలువ ఉంటుందని తెలిపారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. తప్పించుకున్న వారికోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు.