ఒరిస్సా రైలు ప్రమాదంపై తొలగని అనుమానాలు
ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రైల్వే సిబ్బంది తీరుపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ రైల్వే చరిత్రలోనే పెద్ద డిజాస్టర్‌గా పేరుతెచ్చుకుంది ఈ యాక్సిడెంట్. అయితే లోకో పైలెట్ మెహంతీకి ఈ యాక్సిడెంట్ కారణంగా, రెండుకాళ్లు తెగిపడ్డాయి. అనంతరం కొన్ని గంటలలోనే మృతి చెందారు. అయితే ఈ విషయాలు తెలిసి అసిస్టెంట్ పైలెట్ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరే కాకుండా కేటరింగ్ వంటి ఇతర సేవల పనివారు కూడా ఈ రైలులో ఉన్నారు. వారి విషయంలో నోరు మెదపట్లేదు రైల్వేశాఖ. ఈ రెండు రైళ్లలో కలిపి 50 మంది సిబ్బంది ఉన్నారు. వీరు ఎలా ఉన్నారో ఎవరూ మాట్లాడడం లేదు. ఎంతమంది మరణించారో, ఎవరు చికిత్స పొందుతున్నారు అనే విషయాలు ఎవరికీ తెలియడం లేదు.