మహారాష్ట్రలో మంటల అలజడి
మహారాష్ట్రలోని మూడు ప్రధాన నగరాలైన ముంబై, థానే, పూణెలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. థానేలోని స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబైలోని కమర్షియల్ బిల్డింగ్‌లో, పూణె లోని చెక్కగోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. వీటికి గల కారణాలు తెలియరాలేదు. ముంబై, థానేలలో మంటలు అదుపులేకి వచ్చాయి. అయితే ఇంకా పూణెలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదని సమాచారం. పూణెలో చెక్కగోడౌన్ కావడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. దగ్గరలోని 10 గ్యాస్ సిలెండర్లను ఆ ప్రదేశం నుండి తప్పించడంతో పెద్దప్రమాదం తప్పిందనే చెప్పాలి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముంబైలోని కమర్షియల్ బిల్డింగ్‌లో ఏడవ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాలలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. కానీ కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు.