కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్టయ్యింది
తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందన్నారు. ఈసారి రాబోయే ఎన్నికలలో 88 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీగా టీఆర్‌ఎస్ పేరు మార్చినప్పుడే తెలంగాణా ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ కోల్పోయిందన్నారు. తెలంగాణా సాధించింది, తెలంగాణా నేతలు పాలించడానికి అని పేర్కొన్నారు. షర్మిల ఏపీకి సంబంధించిన నేత అన్నారు. తెలంగాణాతో తనకు సంబంధం లేదన్నారు. మేముంటున్నగాంధీభవన్ కూడా మాసొంతం కాదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే టీఆర్‌ఎస్‌కి భూమి కేటాయించిందని, కానీ బీఆర్‌ఎస్ మేము 5,100 గజాలకు డబ్బులు కట్టినా కాంగ్రెస్‌కు కేటాయింపులు జరపలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు మాత్రం 11 ఎకరాలు కేటాయించుకున్నారని మండిపడ్డారు. తమకు భూమి కేటాయించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా కేటాయించలేదని మండిపడ్డారు.