Home Page SliderNational

హీరో శర్వానంద్ పెళ్లి ఎప్పుడంటే..?

హీరో శర్వానంద్,రక్షిత రెడ్డిల నిశ్చితార్థం ఈ ఏడాది ఆరంభంలోనే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే నిశ్ఛితార్థం అయ్యి దాదాపు కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ పెళ్లి తేది ప్రకటించకపోవడంతో శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు స్వస్తి పలుకుతూ.. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఎట్టకేలకు శర్వానంద్ పెళ్లి  తేదిని ప్రకటించారు. కాగా రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ వీరి వివాహం జూన్ 2,3 తేదిలలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ వివాహానికి శర్వానంద్ స్నేహితులు,సినీ,రాజకీయ ప్రముఖులను ఆహ్వనించనున్నట్లు సమాచారం. దీంతో శర్వానంద్ పెళ్లి టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో  శర్వానంద్ ,రక్షిత జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.