Home Page SliderNational

కర్నాకటలో కాంగ్రెస్ పార్టీ విజయం, 134 స్థానాల్లో ఆధిక్యం

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ 134 సీట్లలో ఆధిక్యం కనబర్చుతోంది. దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓటమిని అంగీకరించారు. అధికార బీజేపీ కేవలం 64 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. హెచ్‌డీ కుమారస్వామికి చెందిన జేడీ(ఎస్) 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రధాని, బీజేపీ కార్యకర్తలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజా తీర్పును మార్చలేకపోయామన్నారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మేము వివరణాత్మక విశ్లేషణ చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలలో తిరిగి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక రూపొందిస్తామన్నారు.