Home Page SliderNational

కర్ణాటకలో బీజేపీ ప్లాన్ B అమలు చేస్తుందా?

కర్ణాటకలో ఎన్నికల కురుక్షేత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటి కనబడుతోంది. కాగా ఈ రోజు కౌంటింగ్ మొదలైనప్పటినుంచి కాంగ్రెస్ ముందంజలోనే కొనసాగుతోంది. అయితే ఈ  ఫలితాలు చూసి బీజేపీకి కళ్లు తిరుగుతున్నట్లు కన్పిస్తోంది. దీంతో కర్ణాటకలో బీజేపీ ప్లాన్ Bని అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడంతో బీజేపీ JDS పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కలిసి పనిచేద్దామని,అధికారాన్ని పంచుకుందామని బీజేపీ జేడీఎస్‌కు ఆఫర్లు ఇస్తుందని సమాచారం. ఈ విధంగా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.