“ది కేరళ స్టోరీ” పై వర్మ సంచలన ట్వీట్
టాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “ది కేరళ స్టోరీ” మూవీపై స్పందించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై నిషేదం విధించాలంటూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై సంచలన వాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తమిళ,మళయాళం అమ్మాయిలు ప్రధాన పాత్రలు పోషించారన్నారు. కాగా హిందీ సినిమాగా బెంగాళీ వ్యక్తి డైరెక్ట్ చేశారని..గుజరాత్‌కు చెందిన వ్యక్తి నిర్మించారని ట్వీట్ చేశారు. విభిన్న భాషలు,ప్రాంతాలవారు కలిసి చేసిన ఈ సినిమాకు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తోందన్నారు. ఈ విధంగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారుతోందని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.