వాలంటీర్లను తీసివేయం : నారా లోకేష్
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ఏనాడు చెప్పలేదని వాటిని పంచాయతీలకు అనుసంధానం చేసి పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో భాగంగా 79వ రోజు సోమవారం ఆదోని నియోజకవర్గం పెద్ద తుంబలం క్రాస్ వద్ద సర్పంచ్‌లతో నిర్వహించిన పల్లె ప్రగతి కోసం మీ లోకేష్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో వివరించారు. పట్టణాలకు దీటుగా పల్లె సీమలను అభివృద్ధి చేస్తామని ప్రణాళిక బద్ధంగా త్రాగునీరు వీధి దీపాలు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పారిశుధ్య గ్రీన్ అంబాసిడర్ వంటి కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి మీరందరూ కోరుకుంటున్న మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని… పల్లె సీమల్లో స్వర్ణయుగం తీసుకొస్తామని లోకేష్ అన్నారు.
