దేశంలో చైనా వ్యాపారాలకు కళ్లెం వేసిన పాక్
మన దాయాది దేశం పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. కాగా అక్కడి వారికి తినడానికి కూడా తిండిలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తమ దేశంలో జరుగుతున్న చైనా వ్యాపారాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాక్లో చైనా వ్యాపారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే పాక్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం తమ జాతీయ సంపదను చైనా కొల్లగొడుతుందని పలు ఉగ్రవాద సంస్థలు ఆరోపించడమే అని తెలుస్తోంది. కాగా ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పాక్ ప్రజలపై పలుమార్లు దాడులకు తెగబడ్డాయి. దీంతో పాక్ ప్రజల్లో చైనీయుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. అయితే ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో ఎవరి భద్రతను వారే చూసుకోవాలన్నట్లు పాక్ వ్యవహరించడంతో చైనా ఏం చేయలేకపోతుంది. దీంతో పాక్లో చైనా సూపర్ మార్కెట్లు ,రెస్టారెంట్లు,సముద్ర ఉత్పత్తుల కంపెనీలు మూతపడ్డాయి.