అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దన్న తెలంగాణ హైకోర్టు
మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంది. అదే సమయంలో, వివేక హత్య కేసులో, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు అవినాష్ రెడ్డిని ఆదేశించింది. మొత్తంగా అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ విచారణ సరిగా లేదంటూ… తనను అనవసరంగా టార్గెట్ చేస్తోందంటూ కొద్ది రోజులుగా అవినాష్ రెడ్డి వాదిస్తున్నారు. ఇటీవల కేసు విచారణలో భాగంగా సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో చిత్రీకరించాలని కోర్టు స్పష్టం చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.