యూట్యూబ్‌లో తగ్గెదేలే అంటున్న “పుష్ప-2” వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. ఇటీవల ఈ సినిమా నుంచి ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. అదేంటంటే ఈ వీడియో తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళ భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ఈ వీడియో 3.3 మిలియన్ల లైక్స్ కూడా సాధించినట్లు ఈ సినిమా మేకర్స్ వెల్లడించారు. దీంతో “పుష్పరాజ్ తన బ్లాక్ బస్టర్ రూల్‌ను ప్రకటించాడు” అని పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. గతంలో వచ్చిన “పుష్ప” సినిమా పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 సినిమాను డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్నారు.

