దేశంలో 9 వేలు దాటిన కరోనా కొత్త కేసులు
భారతదేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాగా దేశంలో గత నెలరోజుల నుంచి ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,111 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఇవాళ 27 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపింది. గత 4 రోజులుగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా..నిన్న మాత్రం ఈ సంఖ్య కొంతమేర తగ్గింది. కాగా ఈ సంఖ్యను మరింతగా తగ్గించాలంటే దేశంలోని ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

