Home Page SliderNational

కర్నాటకలో 52 మంది కొత్త అభ్యర్థులకు బీజేపీ టికెట్లు

బీజేపీ నేతల కంటే కాంగ్రెస్ నేతలపైనే నమ్మకమా?
224 స్థానాల్లో 189 అభ్యర్థుల ప్రకటన
బీజేపీ ప్రయోగాలు చేస్తూనే ఉంటుందన్న పార్టీ నేత సీటీ రవి
తిరుగుబాటుకు సిద్ధమవుతున్న ఆ నాటి కీలక నేతలు

భారతీయ జనతా పార్టీ రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో 52 మంది కొత్త ముఖాలకు టిక్కెట్లు ఇవ్వడంతో, ఇతర పార్టీలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూనే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి అన్నారు. చిక్ మంగళూరు నియోజకవర్గం నుంచి సీటీ రవిని బీజేపీ పోటీకి దింపింది. ‘నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు పార్టీ పట్ల నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో 52 మంది కొత్త వారికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కొత్త ప్రయోగాలు చేస్తున్న బీజేపీని వైవిధ్యభరితమైన పార్టీ అంటారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని CT రవి ANIకి చెప్పారు. ఏప్రిల్ 20 నాటికి, కర్నాటక ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోటీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, జేడీఎస్ రెండు పార్టీలూ కర్నాటకలో ఒంటరిగా బరిలో నిలుస్తున్నాయన్నారాయన.

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 189 స్థానాలకు గానూ 52 మంది కొత్త అభ్యర్థులకు టికెట్లు కేటాయించి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకొంది. 52 మంది కొత్త ముఖాలు, ఎనిమిది మంది మహిళలు, 9 మంది వైద్యులు, ఐదుగురు న్యాయవాదులు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, 8 మంది సామాజిక కార్యకర్తలకు టికెట్లు ఇచ్చామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రన్‌కు కూడా టికెట్‌ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఛామ్‌రాజ్‌పేట నియోజకవర్గం నుంచి బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్‌ భాస్కర్‌రావును పార్టీ పోటీకి దింపింది.

రాష్ట్ర మంత్రులు – శశికళ జోలాయి, ఆర్ అశోక్, ప్రభో చౌహాన్, శంకర్ మునియాకప్ప, మునిరత్న, ఎస్టీ సోమశేఖర్, వీసీ పాటిల్, వరిటీ వాసురాజ్, ముర్గేష్ నిరాణి, సీసీ పాటిల్, సునీల్ కుమార్, శివరామ్ హెబ్బార్‌లకు మరోసారి పార్టీ టికెట్లు కేటాయించింది. అసెంబ్లీ స్పీకర్ విశ్వసర్ హెగ్డేకు టికెట్ లభించింది. గోవింద్‌రాజ్ నగర్ నుండి ఎమ్మెల్యే వి సోమన్నకు చామరాజ్ నగర్, వరుణ అసెంబ్లీ నుండి టికెట్ లభించింది. కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యకు సవాలు చేసేలా అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసింది. బీజేపీ జాబితాలో లింగాయత్-51, వొక్కలింగ-41, కుర్బా-7, ఎస్సీ-30, ఎస్టీ-16, ఓబీసీ సామాజికవర్గం నుంచి 32 మందికి టికెట్లు దక్కాయి. ఇదిలా ఉండగా, రాబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో బెలగావి నార్త్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ బెనకే మద్దతుదారులు మంగళవారం సాయంత్రం నిరసనకు దిగారు. ఇంకా, బీజేపీ ఎమ్మెల్యే మహదేవప్ప యాదవ్‌కు టిక్కెట్ నిరాకరించడంపై బెళగావిలోని రామ్‌దుర్గ్ నియోజకవర్గంలో మద్దతుదారులు నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన చిక్క రేవణ్ణకు టికెట్ దక్కింది.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం ప్రారంభించడంతో ఆయననను పార్టీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించారు. వాస్తవానికి పార్టీ హైకమాండ్ ఆయనను రంగంలోకి దింపేందుకు ఇష్టపడలేదు. కానీ షెట్టర్ అంగీకరించడం లేదు. పార్టీ కోసం పని చేయాలని బీజేపీ పెద్దలు, షెట్టర్‌ను కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దివంగత కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ భార్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ రాదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. తేజస్విని అనంత్‌కుమార్‌కు టిక్కెట్‌ ఇవ్వబోమని, అయితే రానున్న కాలంలో పార్టీలో పెద్దపీట వేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.