ఏపీలో ఇకపై పాలిటెక్నిక్ 3 ఏళ్ళు కాదు..4 ఏళ్లు..!
ఏపీ ప్రభుత్వం త్వరలో పాలిటెక్నిక్ కోర్సులో కీలక మార్పులు చేయనుంది. కాగా దీని కోసం సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం ఏపీలో పాలిటెక్నిక్ కోర్సు వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. అయితే పాలిటెక్నిక్ కోర్సు మూడేళ్లలో పూర్తయ్యాక మరో ఏడాదిపాటు తప్పనిసరిగా పరిశ్రమలో పనిచేయాలనే కొత్త రూల్ తీసుకురావాలని సూచించింది. దీంతో ఇకపై పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చెయ్యడానికి నాలుగేళ్లు పడుతుంది. కాగా పాలిటెక్నిక్ మూడేళ్లు పూర్తి కాగానే చాలామంది బీటెక్ చదువుతారు. అయితే ఈ తాజా నిర్ణయంతో బీటెక్ చదవాలనే పాలిటెక్నిక్ విద్యార్థుల చదువులకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది.