Andhra PradeshHome Page Slider

సముద్రంలో చేపలవేటపై ఆంక్షలు పెట్టిన ఏపీ ప్రభుత్వం

ఏపీలోని సముద్రతీర ప్రాంతాలలో చేపల వేటను నిషేధించింది రాష్ట్రప్రభుత్వం. ఈ నెల 15 వ తేదీనుండి జూన్ 14 వతేదీ వరకూ మెకనైజ్డ్, మోటార్ బోట్లతో నిర్వహించే చేపలవేటపై నిషేధాన్ని అమలు చేస్తోంది. ఎందుకంటే ఈ కాలం చేపలకు, రొయ్యలకు సంతానోత్పత్తి కాలమని, అందుకే ప్రతీ ఏటా ఈ కాలంలో నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి బోట్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీనితో పాటు జరిమానా విధిస్తామని, రాయితీలు, ఇతర సౌకర్యాలు రద్దు చేస్తామని పేర్కొన్నారు.