Home Page SliderTelangana

పూటకో మాట.. పూటకో కుట్ర.. కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ధ్వజం

– తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అధికార దుర్వినియోగం
– పాలనా వైఫల్యాలు, టీఎస్పీఎస్సీ నిరుద్యోగుల ఆక్రోశం నుంచి దృష్టిమళ్లించే కుట్ర
– పోలీసులను పావులుగా వాడుకోవడం కేసీఆర్​ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య
– తెలంగాణలో జర్నలిస్టుల హక్కులను కాలరాసే ప్రయత్నం
– దిగజారుడు మాటలు, అన్​పార్లమెంటరీ మాటలకు బీజం వేసింది కేసీఆరే..
– సింగరేణిని ప్రైవేటికరించే ప్రసక్తే లేదని మోడీ స్పష్టం చేశారు!
౼ జర్నలిస్ట్ లను బీఆరెస్ బెదిరిస్తుంది.. బీజేపీ అండగా ఉంటుందన్న కిషన్ రెడ్డి

కల్వకుంట్ల కుటుంబం పూటకోమాట.. పూటకో కుట్ర చేస్తున్నదని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు.. టీఎస్పీఎస్సీ పేపర్​ లీకేజీపై నిరుద్యోగుల ఆక్రోశాన్ని దృష్టి మళ్లించేందుకు కుట్రలకు తెరలేపాని పేర్కొన్నారు. గతంలో ఫామ్​హౌజ్​ ఫైల్స్​లో చూశామని, పోలీసులను పావులుగా వాడుకోవడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని కిషన్​ రెడ్డి విమర్శించారు. ఈటల రాజేందర్​ కు నోటీసులు ఇవ్వడాన్ని, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ అక్రమ అరెస్టులను బీజేపీ ఖండిస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాల యూనివర్సిటీలో పీహెచ్​డీ చేసిందన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తోందని… 5 గంటలకు నోటీసులు ఇచ్చి.. ఆరు గంటలకు విచారణకు రావాలని ఈటలకు నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఎవరో మెసేజ్​ పంపారు కాబట్టి.. దర్యాప్తు చేయాలని నోటీసు ఇచ్చారు. వాట్సాప్​ మేసేజ్​లు వచ్చిన వారందరికీ నోటీసులు ఇస్తే.. ఏ ఒక్కరూ మిగలరు.. ఇలాంటి విధానం ఎక్కడా లేదు. కేసీఆర్ ఫ్యామిలీ అధికార దుర్వినియోగాన్ని సమాజం చూస్తోందన్న కిషన్ రెడ్డి… శిశుపాలుడిలాగే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రజల శిక్ష విధిస్తారన్నారు.


ప్రశాంత్​ అనే వ్యక్తి అనేక మంది జర్నలిస్టులకు వాట్సప్​ మెసేజ్​ ఫార్వార్డు చేశారని. జర్నలిస్టులను కూడా పోలీసులు బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. జర్నలిస్టులు తమకు వచ్చే సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వాట్సప్​ను వాడుకోవడం ప్రపంచంలో సర్వసాధారణమని… బీఆర్ఎస్​ నాయకులు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధానిని విమర్శించే అధికారం కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడిదని? దిగజారుడు మాటలు, అన్​పార్లమెంటరీ మాటలకు బీజం వేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రే అన్ని విషయం గుర్తుంచుకోవాలన్నారు కిషన్ రెడ్డి. జర్నలిస్టుల హక్కులను కాలరాసే ప్రయత్నం తెలంగాణలో జరుగుతోంది. జర్నలిస్టులు ఎవ్వరూ కూడా భయపడొద్దని అండగా ఉంటామన్నారు. బేషరతుగా బండి సంజయ్​ మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. సీపీ మాట్లాడుతూ.. బండి సంజయ్​ మీదనే కేసులు పెట్టాం.. ఈటలను పిలవడం లేదన్నారు. మరి ఒక్క రోజులోనే మార్పు ఎలా వచ్చింది.. అందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఈటల రాజేందర్​కు నోటీసులు ఇచ్చినా, బండి సంజయ్​ను జైలులో పెట్టినా మేము భయపడం.. అన్ని రకాల పోరాటాలకు బీజేపీ సిద్ధంగా ఉన్నామన్నారు.

సింగరేణిపై బీఆర్ఎస్​ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. ‘‘సింగరేణి 51శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ.. 49 శాతం వాటాకు పరిమితమైన కేంద్రం ఎలా ప్రైవేటికరిస్తుందో బీఆరెస్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి అడ్మినిస్ట్రేషన్​పై అధికారం ఉంది. సింగరేణిని ప్రైవేటుపరం చేయొద్దు. ప్రైవేటు పరం చేస్తానంటే బీజేపీ పోరాడుతుంది. సింగరేణి మైన్స్​ను ప్రైవేటుకు ఇచ్చింది బీఆర్ఎస్​ పార్టీనే.. ఓ మైన్​ను ఓ వ్యక్తికి అడ్డికిపావుశేరు లెక్కన ఎలా ఒప్పందం చేసుకున్నారో.. సీబీఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నారా? సింగరేణి ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ రామగుండంలో స్పష్టంగా చెప్పారు. కార్మికులు గమనించాలి. సింగరేణి ఎన్నికలు వస్తున్నందున.. ఓడిపోతామనే భయంతో.. సింగరేణి విషయంలో బీఆర్​ఎస్​ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పిడికిలి బిగించాలి. సింగరేణిని నష్టాలకు గురిచేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే! సింగరేణి భూములను కొల్లగొట్టింది.. బీఆర్ఎస్​ నాయకులే”అని అన్నారు.