2050 నాటికి భారత్‌కు పొంచివున్న ముప్పు
ప్రపంచంలోని అన్నీ దేశాలతోపాటు భారత్ కూడా కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పాలి. అయితే ఈ ప్రాణాంతక ముప్పు నుంచి బయటపడిన భారత్ త్వరలోనే మరో ముప్పును ఎదుర్కొవాల్సివుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇంతకీ ఆ ముప్పు ఎంటంటే “నీటి కొరత”. ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని అర్బన్ ప్రాంతాల్లో నీటి కొరత గణనీయంగా పెరిగిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కాగా భారత్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 2016లో నీటి కొరతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 933 మిలియన్లుగా ఉంది. కాగా 2050 నాటికి దీని సంఖ్య 1.7-2.4 బిలియన్‌కు చేరే అవకాశముందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. పరిస్థితి చేయిదాటక ముందే ప్రపంచంలోని అన్నీ దేశాలు “నీటి కొరత”ను అరికట్టేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.

