టీచర్ ఎమ్మెల్సీ విజయంపై అమిత్ షా ట్వీట్
మహబూబ్ నగర్-రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. చారిత్ర విజయం సాధించిన ఎవీఎన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని… మోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తాజా విజయం రుజువు చేస్తోందన్నారు.
టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్సీగా గెలుపొందడమంటే ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని రుజువు చేసిందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం అన్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసిందన్నారు. టీచర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్సీ సీటు గెలవడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికలు BRSకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులలో తీవ్ర వ్యతిరేకతను రుజువు చేస్తున్నాయన్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి AVN రెడ్డి విజయం సాధించారు.

