సమావేశాలు పూర్తయ్యేవరకు కేశవ్, రామానాయుడు సస్పెన్షన్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఇద్దరు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయడును బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. గవర్నర్‌పై అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పీకర్ చెప్పారు. సభ్యులు గవర్నర్ వ్యవస్థను కించపరిచారన్నారు. గవర్నర్‌పై అసత్య ప్రచారానికి తెరదీసినందుకు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. గవర్నర్‌ను అవమానించిన తీరును సీరియస్‌గా తీసుకుంటామన్నారు. గవర్నర్‌ను అవమానిస్తే కఠిన చర్యలుంటాయని స్పీకర్ సభ్యులను హెచ్చరించారు.

