Andhra PradeshHome Page Slider

అది గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాదు… లోకల్ ఫేక్ సమ్మిట్

ఏపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటున్న 13 లక్షల కోట్ల వైజాగ్ సమ్మిట్ బోగస్ అంటూ తేల్చేశారు టీడీపీ యువనేత నారా లోకేశ్. ఏపీలో తీవ్రవాదం నడుస్తోందని… జగన్ తీరుతో పారిశ్రామికవేత్తలు బైబై అంటూ పారిపోతున్నారన్నారు. జగన్ సర్కారొచ్చాక… ఉద్యోగాలు నిల్… గంజాయి ఫుల్ అంటూ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర పీలేరుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో దావోస్ వెళ్లినప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు.. ఇప్పుడు జరిగినట్టుగా కట్టుకథలు అల్లారన్నారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు.. మళ్లీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా జరిగినట్టుగా కలరింగ్ ఇచ్చారన్నారు. మొత్తంగా విశాఖలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదని.. లోకల్ ఫేక్ సమ్మిట్ అంటూ ఎద్దేవాచేశారు. జగన్ సీఎం అయ్యాక లాభపడింది ఒక్క భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమేనన్నారు. పీపీఏల రద్దు దగ్గర్నుంచి… పరిశ్రమలన్నింటినీ తరిమేశారన్నారు. లక్ష రూపాయల కంపెనీ రూ. 76 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందా అంటూ లోకేశ్ ప్రశ్నించారు.