Andhra PradeshHome Page Slider

బర్త్‌డే పేరుతో విద్యార్థులు ‘రేవ్ పార్టీ’

బర్తడే పేరు చెప్పి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో శాంతినగర్‌లో విద్యార్థులు రేవ్ పార్టీ చేసుకున్నారు. వీరు విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులని తెలిసింది. అంతే కాదు వీరి వద్ద ఒక కేజీ గంజాయి కూడా దొరికినట్లు సమాచారం. ఈ పార్టీలో 10 మంది యువకులు, ముగ్గురు యువతులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు చేశారని, అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వీరి వద్ద గంజాయి దొరకడం కూడా సంచలనానికి దారి తీసింది. వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా ? వీరివద్దకు ఇంతమొత్తంలో  గంజాయి ఎలా వచ్చింది? అనే వివరాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత చిన్నవయస్సులోనే విద్యార్థులు ఇలాంటి పనులకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.