చైనా నుంచి కర్నాటకకు ఐఫోన్ ఫ్యాక్టరీ
బెంగళూరుకు సమీపంలో 300 ఎకరాల్లో ఫ్యాక్టరీ
లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు
చైనా తీరుతో కంపెనీని షిఫ్ట్ చేస్తున్న ఫాక్స్‌కాన్
ఇండియాలోనే ఇక ఐఫోన్ తయారీ కేంద్రం
యాపిల్ ఇంక్ భాగస్వామి ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్.. ఇండియాలో స్థానికంగా యాపిల్ ఉత్పత్తిని పెంచడానికి భారతదేశంలో కొత్త ప్లాంట్‌ను సుమారు $700 మిలియన్ల పెట్టుబడితో (సుమారుగా రూ. 5737 కోట్లు) పెట్టాలని యోచిస్తోంది. అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరుగుతున్నకొద్దీ చైనా నుండి తయారీ కర్మాగారాలను బయటకు తరలించాలని అమెరికా భావిస్తోంది. తైవానీస్ కంపెనీ, దాని ఫ్లాగ్‌షిప్ యూనిట్ హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో, బెంగళూరులోని విమానాశ్రయానికి సమీపంలోని 300 ఎకరాల స్థలంలో ఐఫోన్ విడిభాగాలను తయారు చేయడానికి ప్లాంట్‌ను నిర్మించేందుకు చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీ యాపిల్ హ్యాండ్‌సెట్లను కూడా రూపొందిస్తుంది. Foxconn ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేయడానికి బెంగళూరు కేంద్రాన్ని ఉపయోగించవచ్చు.

భారతదేశంలో ఇప్పటి వరకు ఫాక్స్‌కాన్ అతిపెద్ద పెట్టుబడి ఫ్యాక్టరీ ఇదే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా చైనా తన హోదాను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో… ఇదో అతి పెద్ద కుదుపుగా భావించాల్సి ఉంటుంది. యాపిల్ తాజా నిర్ణయం చైనాకు మింగుడుపడటం లేదు. Apple, ఇతర US బ్రాండ్‌లు చైనాను వదిలి… భారతదేశం, వియత్నాం వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా ఆలోచనల్లో మార్పు వస్తోంది. చైనా, రష్యాకు సహకరిస్తోందన్న ఉక్రోషం అమెరికాలో ఉంది. అదే సమయంలో కరోనా తర్వాత చైనా తీరుపై అమెరికా ఆగ్రహంగా ఉంది. దీంతో ఇప్పటి వరకు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు స్వర్గధామంగా ఉన్న చైనాను కట్టడి చేసే ఆలోచనల్లో అమెరికా పడింది. అందుకే అంతర్జాతీయ తయారీ విధానాన్ని పునర్నిర్వచించాలని అమెరికా భావిస్తోంది.

భారతదేశంలోని కొత్త ఉత్పత్తి ప్రదేశం సుమారు లక్ష ఉద్యోగాలు సృష్టించగలదని భావిస్తున్నారు. చైనా నగరం జెంగ్‌జౌలో కంపెనీ విశాలమైన ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్నిసార్లు అక్కడ ఉద్యోగుల సంఖ్య భారీగాను పెరుగుతుంటుంది కూడా. కరోనా తర్వాత జెంగ్‌జౌలో ఉద్యోగుల సమ్మెతో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. నాటి నుంచి కంపెనీ ఎక్కడకు షిఫ్ట్ చేయాలన్నదానిపై ఆలోచనలో పడింది. చైనా నుండి వేగంగా కంపెనీని తరలించాలని ఫాక్స్ కాన్ భావిస్తోంది. ఇండియాలో పనులు ప్రారంభించి… సరఫరాదారులు ఊహించిన దానికంటే చాలా వేగంగా ఉత్పత్తి ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది. ఫాక్స్‌కాన్ పెట్టుబడులు, ప్రాజెక్ట్ వివరాలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నందున ప్రణాళికలు మారే అవకాశం ఉంది. ప్లాంట్ కొత్త సామర్థ్యాన్ని సూచిస్తుందా లేదా? ఫాక్స్‌కాన్ చైనా నుంచి తరలింపులపై ఆధారపడి ఉందా అన్నది తేలాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాలపై స్పందించడానికి ఆపిల్ నిరాకరించింది. ఈ వారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన యంగ్ లియు చైర్మన్ హాన్ హై, వ్యాఖ్య కోరుతూ వచ్చిన ఇమెయిల్‌కు వెంటనే స్పందించలేదు. కర్నాటక ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించలేదు. భారత పర్యటనలో ఉన్న లియు తెలంగాణలో మరో తయారీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు.

పాశ్చాత్య పెట్టుబడిదారులు, కార్పొరేషన్లు బీజింగ్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. చైనాతో భారతదేశం సాంకేతిక అంతరాన్ని మూసివేయడానికి అవకాశాన్ని చూస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఫాక్స్‌కాన్ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. గత సంవత్సరం తమిళనాడులోని ఒక సైట్‌లో లెటేస్ట్ ఐఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించిన ఫాక్స్‌కాన్, ఆపిల్ సరఫరాదారులకు భారతదేశం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించింది. చిన్న ప్రత్యర్థులు విస్ట్రోన్ కార్ప్, పెగాట్రాన్ కార్పోరేషన్ కూడా భారతదేశంలో జోరుగా కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. జబిల్ ఇంక్ వంటి సరఫరాదారులు స్థానికంగా ఎయిర్‌పాడ్‌ల కోసం విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించారు.