మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ పై అద్భుత విజయాన్ని అందుకొంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి తప్పించుకోవడం అసాధ్యమయ్యింది. ఆస్ట్రేలియా ముందు టీమ్ ఇండియా 76 పరుగులు విజయ లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి చేరుకొంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన భారత్ ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవమైన ప్రదర్శనతో చికాకు పెట్టారు. 163 పరుగులకే ఆలౌటై.. అభిమానులను నిరాశపర్చారు. చటేశ్వర పూజారా 59 పరుగులు మినహా చెప్పుకోదగ్గ ఆట ఒక్కరు కూడా ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ 8 వికెట్లు పడగొట్టి భారత్ టాప్ ఆర్డర్ వెన్నువిరిచాడు. రెండు రోజుల్లో 30 వికెట్లు పడటం కూడా సంచలనమని చెప్పాలి. నాలుగు టెస్టుల సీరిస్‌లో మొదటి రెండు టెస్టుల్లో ఇండియా విజయం సాధిస్తే మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఇక స్టేడియంలో ఉన్న ఆస్ట్రేలియా అభిమానులు పండుగు చేసుకున్నారు.
