Home Page SliderNational

నాగాలాండ్‌లో బీజేపీ కూటమిదే విజయం

ఫిబ్రవరి 27న జరగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా నాగాలాండ్‌లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణం ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ, మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) మెజారిటీ మార్క్ 31 ఉన్న 60 సీట్లలో 35 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్), కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీట్ల షేరింగ్ ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన ఎన్‌డిపిపి 40 స్థానాల్లో పోటీ చేయగా, బీజేపీ 20 స్థానాల్లో పోటీకి దిగింది. ముఖ్యమంత్రి నీఫియు రియో ​​నేతృత్వంలోని ఎన్‌డిపిపి 2018లో గత ఎన్నికల నుండి బీజేపీతో పొత్తులో ఉంది. గత ఎన్నికల్లో కూటమి 30 సీట్లు గెలుచుకోగా, ఎన్‌పిఎఫ్ 26 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం ఆ పార్టీ నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ రెండో చోట్ల ఆధిక్యంలో ఉంది. నాగాలాండ్‌లో ఇతరులు 20 స్థానాల్లో లీడ్‌లో ఉండటం విశేషం. గత ఎన్నికల్లో కేవలం నలుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తాజాగా 16 మంది ఎన్నికల్లో గెలిచేలా సీన్ కన్పిస్తోంది. 2003 వరకు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది. ఫిబ్రవరి 27న 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి – జున్హెబోటో జిల్లాలోని అకులుటో ఒక స్థానంలో బిజెపి నామినీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కజెటో కినిమి పోటీ లేకుండా గెలుపొందారు. 1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి నాగాలాండ్‌లో 14 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలవలేదు.