National

అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీం విచారణ

ప్రముఖ పారిశ్రామికవేత్త ,అపర కుబేరుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంస్థలపై అమెరాకు చెందిన ఇన్‌వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అదానీకి భారీ నష్టం వాటిల్లింది. ఆయన లక్షల కోట్ల సంపదని కోల్పోయారు. అయితే దీనిపై SEBI సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ అభయ్ మనోహర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హిండెన్‌బర్గ్ వ్యవహారంపై  2 నెలల్లో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ కమిటీని ఆదేశించింది.