Andhra PradeshHome Page Slider

మూడు రోజులపాటు విశాఖలోనే సీఎం వైఎస్ జగన్

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం పర్యటన

విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

02.03.2023 షెడ్యూల్‌

సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

03.03.2023 షెడ్యూల్‌

ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరు. రాత్రి 8.00 – 9.00 ఎంజీఎం పార్క్‌ హోటల్‌లో జీఐఎస్‌ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

04.03.2023 షెడ్యూల్‌

ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.