దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీకి రండి, చంద్రబాబు, పవన్‌కు జగన్ సవాల్
పేదల డబ్బు పెత్తందారీల జేబుల్లోకి
గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉన్నా ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రజలు చంద్రబాబును నిలదీయాలని సీఎం జగన్ కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు నేరుగా సాయం అందించామని సీఎం జగన్ సభలో వివరించారు. ఇప్పుడు పేదలకు అందిన డబ్బు పెత్తందారీల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు అండ్ కో కు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ రాజకీయ సమానత్వం తెచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధంలో మంచి జరిగిన ప్రతి ఒక్కరూ సైనికులుగా నిలుస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని. క్లాస్ వార్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. పేద వాడు ఒకవైపు, పెత్తందారీ మరో వైపు నిలిచిన ఈ యుద్ధంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా రాజకీయాల్లో మాట ఇవ్వడం మాట మీద నిలబడ్డం జరగదని వ్యాఖ్యానించారు. పేదవాడిని మరింత పేదరికంలోకి తొక్కేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయతే ప్రమాణంగా రాజకీయాలు తాము మేనిఫెస్టో పక్కాగా అమలు చేసి మీ బిడ్డ ఓటడిగేందుకు వస్తున్నారని తెలిపారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే మీ బిడ్డకు భయం లేదని. ఈ ధీమాతోనే 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తామని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే దమ్ము దత్తపుత్రుడికి ఉందో లేదో తేల్చుకోవాలని సీఎం జగన్ సవాల్ విసిరారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు జగన్. కారణం ఏ రోజు ప్రజలు మీరు మంచి చేయలేదని ప్రజలకు మంచి చేశాం కాబట్టే మరో సారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు అండ్ కో కుట్రలు మరింత ఎక్కువ కనిపిస్తాయని ఇవన్నీ చూసి జాగ్రత్తగా నిర్ణయం తీసుకావాల్సిన అవసరం ఉందని ఈ యుద్ధంలో మంచి అందుకున్న మీరే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు.