Home Page SliderTelangana

చిరు ఇంటికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఈ కలయికలో నాగార్జున అక్కినేని, ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జునలు కేంద్ర మంత్రికి శాలువాతో పాటు గణపతి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తున్నట్లు ఫోటో చూడొచ్చు. కేంద్ర మంత్రితో చర్చల వ్యవహారానికి సంబంధించి చిరు ట్వీట్ ఆసక్తికరంగా సాగింది. “నిన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు ప్రియమైన శ్రీ అనురాగ్ ఠాకూర్‌కి ధన్యవాదాలు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, అది సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి, సోదరుడు నాగార్జునతో కలిసి సంతోషకరమైన చర్చ సాగింది”.

నవంబర్ 2022 లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో నటుడిగా ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించినప్పటి నుండి అనురాగ్ ఠాకూర్ చిరంజీవితో రెగ్యులర్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చివరిసారిగా మాస్ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామా వాల్తేరు వీరయ్యలో కనిపించారు. శృతి హాసన్ కథానాయికగా నటించింది. రవితేజ కీలక పాత్ర పోషించాడు. వాల్తేర్ వీరయ్య చిత్రాన్ని నవీన్ యెర్నేని నిర్మించారు. గాడ్‌ఫాదర్‌ తర్వాత సల్మాన్‌ ఖాన్‌తో కలిసి మెగాస్టార్‌ నటించిన తొలి చిత్రం ఇదే.