హత్య కోణంలో కేసు విచారించాలన్న ప్రీతి తండ్రి
వరంగల్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదని… ముమ్మాటికీ హత్యేనన్నారు ఆమె తండ్రి నరేందర్. ప్రీతికి ఎవరో ఇంజెక్షన్ ఇచ్చారని.. ఆమె ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదన్నారాయన. తక్షణం ఆ కోణంలో పోలీసులు విచారించాలని కోరారు. ప్రీతి మృతికి దారితీసిన మొత్తం విషయాలను వెలుగులోకి తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీ అనస్థీషియా హెడ్‌ను సస్పెండ్ చేసిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారించాలన్నారు. అప్పుడే ప్రీతి మృతికి కారణాలన్నీ తెలుస్తాయన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో ప్రీతి అంత్యత్రియలు నిర్వహిస్తారు.

