నరేంద్ర మోడీ ,అమిత్ షాలతో ఏపీ నూతన గవర్నర్ భేటీ
గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధడ్కన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గవర్నర్ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. సాయంత్రం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. శుక్రవారం గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ఆ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టి రాజ్యాంగ పెద్దలు ను కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. ఈరోజు సాయంత్రం ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.


