Home Page SliderNational

2024లో వచ్చేది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం

2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూల్చుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా మారిపోయారంటూ ఆయన మండిపడ్డారు. 2024 ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలతో మాట్లాడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అందుకు నాయకత్వం వహిస్తుందన్నారు. ఇలా చేయకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నాడు. నాగాలాండ్ ఎన్నికల ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి పార్టీతో పిలిచి మాట్లాడుతున్నామన్నారు ఖర్గే. అభిప్రాయాలు పంచుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదన్నారు. మిగతా పార్టీలన్నీ కలిసి మెజారిటీ సాధిస్తాయన్నారు. 100 మంది మోడీ, షాలు వచ్చినా విజయం తమదేనన్నారు.