నేడు ఏపీకి కొత్త గవర్నర్ రాక
• ఈనెల 24న బాధ్యతలు స్వీకరణ
• గవర్నర్ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు విజయవాడ రానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ గవర్నరుగా కొనసాగిన బిశ్వ భూషణ్ హరి చందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో జస్టిస్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు . ఈ నెల 24న రాష్ట్ర గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను రాజ్ భవన్ అధికారులు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి జస్టిస్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా విజయవాడకు రానున్నారు. ఆ తర్వాత ప్రమాణస్వీకారానికి సంబంధించి అధికారులు ఆయనతో చర్చించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

