Home Page SliderInternational

రష్యాను దెబ్బకొట్టాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త

దశల వారీగా, రష్యా ఎదుర్కొంటున్న లక్ష్యాలను జాగ్రత్తగా క్రమపద్ధతిలో పరిష్కరిస్తామన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. ఉక్రెయిన్‌పై, పుతిన్ సైనిక జోక్యం మొదటి వార్షికోత్సవం సందర్భం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో సమస్య తీవ్రతరం కావడానికి అమెరికా, పశ్చిమ దేశాలదే పూర్తి బాధ్యత అన్నారు. ఉక్రెయిన్ సంఘర్షణకు ఆజ్యం పోస్తోంది అమెరికా, యూరప్ దేశాలేనన్నారు పుతిన్. చిన్న సమస్యను యూరప్ దేశాలు ప్రపంచ సంఘర్షణగా మార్చాయన్నారు. అందుకు తగిన జవాబిస్తామన్నారు. రష్యా ఉనికి ప్రశ్నార్థకమవుతున్నందునే తాము యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అత్యంత రహస్యంగా పర్యటించిన తర్వాత పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.