ఈనెల 27 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
• రెండు విడతలగా నిర్వహణ
• తొలిరోజు గవర్నర్ ప్రసంగం మలి రోజు సంతాప తీర్మానాలు వాయిదా
• మార్చి 6 నుంచి రెండో విడత ప్రారంభం 13 రోజులు పాటు నిర్వహణ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 27న ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.
మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, బిఎసి సమావేశం జరగనుంది. రెండో రోజు సంతాప తీర్మానాలు, వాయిదా తీర్మానాలు ఉండనుండగా..అనంతరం అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తం 13 రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అంటే 27,28 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయనున్నారు. మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ కారణంగా తిరిగి అసెంబ్లీ సమావేశాలను మార్చి 6న ప్రారంభించనున్నారు. ఈ సమావేశాలు 13 రోజుల పాటు జరగనున్నాయి. ఆదివారం అధికారికంగా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నదానిపై స్పష్టంగా లేదు. రెండో విడత సమావేశాల్లోనే పెట్టనున్నట్లు తెలుస్తోంది 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ₹2,56,256 కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ఈసారి అంతకుమించి బడ్జెట్ ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
