వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు తాళం పడనుందా?
తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్. వెంకట్ రెడ్డిది… వ్యక్తిగత నిర్ణయమా… పార్టీ నిర్ణయమా అన్నది తేలాల్సి ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి డామేజ్ కలుగుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు అద్దంకి దయాకర్. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి ఉపయోగమా.. నష్టమా అన్నది పెద్దలు ఆలోచించుకోవాలన్నారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యాఖ్యానించినా… వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేసీఆర్ మాట్లాడుతున్నారన్న భావన కలిగించేలా ఉందనడానికి తాజా వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. పార్టీ పెద్దలు సీరియస్గా వ్యవహరించి.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పార్టీ పొత్తుల గురించి వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడినా.. వ్యక్తిగత అభిప్రాయంగా చూడాల్సి ఉందన్నారు మరో నేత మహేశ్ కుమార్ గౌడ్. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్ పొత్తుల కోసం ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ లో ఏ నిర్ణయమైనా సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంటుందని రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కాంగ్రెస్ వల్ల సాధ్యమన్నారు.


