News

అమరావతే రాజధాని : కన్నా లక్ష్మీనారాయణ

మొదట్నుంచి రాజధాని విషయంలో పూర్తి మద్దతుగా మాట్లాడుతున్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఎవరెన్ని చేయాలనుకున్నప్పటికీ అమరావతి రాజధాని అన్నది నిర్ధారణ అయిపోయిందని.. ఈ విషయంలో మరోమాటకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఏపీలో మూడు రాజధానుల అంశం జగన్ కుట్రలో భాగమేనని విమర్శించారు. అమరావతి రాజధానైతే… అభివృద్ధి అంతా ఇక్కడే చేయాల్సి ఉంటుందని దోచుకోవటానికి ఏమీ ఉండదనే జగన్మోహన్ రెడ్డి… విశాఖపట్నం అంటున్నారని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖ అభివృద్ధి చెంది ఉందని… ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చు అనేది జగన్ ఆలోచనని దుయ్యబట్టారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు కన్నా.