Andhra PradeshHome Page Slider

లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఒంగోలు ఎంపీ కొడుకు అరెస్ట్

ఎక్సైజ్ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్
లిక్కర్ స్కామ్‌లో ఎంపీ, తనయుడు కీలకమన్న ఈడీ
కేసులో ఇప్పటి వరకు తొమ్మిదో అరెస్ట్
ఈ వారంలో ముగ్గురిని అరెస్టు చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించి ఈడీ దూకుడు పెంచుతోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ మాగుంటను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం మనీలాండరింగ్ నిరోధక చట్టం… పీఎంఎల్‌ఏ కింద రాఘవ్ మాగుంటను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కోర్టులో హాజరుపర్చి … రాఘవను అదుపులోకి తీసుకోవాలని ఈడీ భావిస్తోంది. లిక్కర్ కేసులో ఈడీకి ఇది తొమ్మిదో అరెస్ట్ కాగా, ఈ వారంలో ఇది మూడోది.

పంజాబ్‌లోని SAD మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా, చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీ డైరెక్టర్ రాజేష్ జోషిని ఈ వారం ప్రారంభంలో ఈడీ అరెస్టు చేసింది. ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం రిటైలర్లు, హోల్‌సేలర్లు, తయారీదారుల ‘సౌత్ గ్రూప్’ అనే సృష్టించారని… ఇందులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవ భాగమని ఈడీ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ప్రభుత్వంలోని ఇతర ఎక్సైజ్ అధికారులను సీబీఐ, ఈడీ ఫిర్యాదుల్లో నిందితులుగా పేర్కొంది.