ఏపీలో జనసేన తోనే పొత్తు లేదంటే జనంతో… సోమ వీర్రాజు స్పష్టత
ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలని ఆ రెండు పార్టీలతో తామెప్పుడూ సమ దూరం పాటిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పొత్తులపై ఆయన మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. గతంలో తాను జనంతో పొత్తు లేకుంటే జనసేనతో పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలపై మరొకసారి వివరణ ఇచ్చారు. జనంతో పొత్తు అనేది చాలా బలమైన పదం అంటూ దీని వెనుక నిఘూడా అర్థం ఉందని చెప్పారు. ఇప్పటికీ తమ పొత్తు జనంతోనే అంటూనే వస్తే జనసేనతో పొత్తు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పొత్తుల విషయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అనేకసార్లు జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటించిన ఆయన ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత స్వరం మార్చారు. అవినీతితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆ రెండు పార్టీలు అడ్డంకిగా ఉన్నాయంటూ భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ వస్తున్నారు. పలుమార్లు ఇదే తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ జనసేన వ్యవహారంలో మాత్రం ఆచితూచి స్పందించేవారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించిన పలు కార్యక్రమాల్లో జనసేన భాగస్వామ్యం కానప్పటికీ తమకు మిత్ర పక్షమేనని చెబుతూ వచ్చారు. ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వనని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందనే పరోక్ష సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అది ఒక ఆప్షన్ మాత్రమే అని చెప్పటం మూడో ఆప్షన్ గా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నట్లుగా చెప్పటం భారతీయ జనతా పార్టీ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు నేరుగా పొత్తులపై చెప్పకపోయినా ఆ పార్టీ క్యాడర్ కూడా అధినేత అభిష్టానికి అనుగుణంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత నెల ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు పాల్గొన్నారు. జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తాము ఎలా వెళ్లాలనే దానిపై స్పష్టత తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులు పాటు భీమవరంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తొలిసారిగా జనంతోనే తమ పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చినియాంశంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరహాలోనే తమకు కూడా రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెప్పటం ద్వారా ఇతర పార్టీలతో కలిస్తే జనసేనకు దూరంగా ఉంటామనే సంకేతాలను సోము వీర్రాజు ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

