పఠాన్ మూవీ రికార్డు, వారం రోజుల్లో ఇండియాలోనే 300 కోట్ల వసూళ్లు
ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత
రూ. 540 కోట్లు రాబట్టిన పఠాన్
తెలుగు, తమిళం వర్షన్లకు డిమాండ్
బహుబలి రికార్డులు బద్ధలు
షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ రికార్డుల సంచలనం సృష్టిస్తోంది. ఆరు రోజుల్లో భారత్‌లో మొత్తం ₹ 296.50 కోట్ల టిక్కెట్ల విక్రయాలు జరిగినట్లు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ నివేదించారు. ఏడో రోజు 300 కోట్ల రూపాయల రికార్డును చేరుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. హిందీ చలనచిత్ర పరిశ్రమలో మునుపటి రికార్డులను బాహుబలి: ది కన్‌క్లూజన్, KGF: చాప్టర్ 2 హిందీ డబ్ల కంటే వేగంగా ₹ 300 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటుతోంది. బాహుబలి: ది కన్‌క్లూజన్ 10 రోజులు, KGF: చాప్టర్ 2′ 11 రోజులతో పోల్చుకుంటే పఠాన్ మూవీ వారంలో దేశీయంగా బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లు వసూలు చేస్తోంది.

సోమవారం కూడా కలెక్షన్స్ భారీగా రావడంతో సినిమా మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశం కన్పిస్తోంది. మంగళవారం అంటే ఏడో రోజు నాటికి ₹ 300 కోట్లను దాటనుంది. బుధవారం 55 కోట్లు, గురువారం 68 కోట్లు, శుక్రవారం 38 కోటి, శనివారం 51.50 కోట్లు, ఆదివారం 58.50 కోట్లు, సోమవారం 25.50 కోట్లు. మొత్తం: ₹ 296.50 కోట్ల వసూళ్లు సాధించినట్టు సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. పఠాన్ తమిళం, తెలుగు డబ్బింగ్ వసూళ్లు ₹ 10.75 కోట్లు రాబట్టగా… సోమవారం మరో కోటి రూపాయలు రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి నాటికి ₹ 540 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
పఠాన్ ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టాడు – ఇది బాలీవుడ్లో అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డులు నమోదు చేయగా… అత్యంత వేగంగా ₹ 200, ₹ 250 కోట్లు వసూలు చేసిన మూవీగా రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజులో దాదాపు ₹ 70 కోట్లు రాబట్టిన ఏకైక హిందీ చిత్రం కూడా ఇదే. జాన్ అబ్రహం పోషించిన రోగ్ ఏజెంట్ జిమ్‌కి వ్యతిరేకంగా టెర్రర్ వ్యతిరేక మిషన్‌లో దీపికా పదుకొణె పాత్రతో జతకట్టిన RAW ఏజెంట్‌గా షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో పఠాన్ నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ జనవరి 25న విడుదలైంది.