Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్

ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా గన్నవరం విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఏసీ పనిచేయకపోవడంతో పైలట్ అత్యవసరంగా దించేశాడు. సీఎం జగన్ స్పెషల్ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యపై అధికారులు విచారణకు ఆదేశించారు. సీఎం జగన్ వెంట జవహర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పూనం మాలకొండయ్య, కృష్ణమోహన్ రెడ్డి, చిదానంద రెడ్డి ఉన్నారు. మంగళవారం ఢిల్లీలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌంట్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. సీఎం జగన్ రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారులు చెప్పారు.