Home Page SliderNational

శ్రద్ధావాకర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

శ్రద్ధావాకర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఆమె హత్యకేసులో ఇప్పటికే కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. అయితే తాజాగా ఆమె పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ విడుదల అయ్యింది. ఈ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో”శ్రద్దావాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా చేసినట్లు” రిపోర్ట్‌లో తేలింది. ఇటీవల శ్రద్ధా వాకర్ ఎముకలను అధికారులు కనుగొన్న విషయం తెలిసిందే. కాగా వారు ఆ ఎముకలను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో పరీక్షలు చేయగా ఈ విషయం బయటకు వచ్చింది.

అయితే అఫ్తాబ్ తన సహజీవన భాగస్వామి శ్రద్దాను దారుణంగా హత్యచేసినట్లు విచారణలో అంగీకరించాడు. గతఏడాది మే 18న అఫ్తాబ్ శ్రద్దాను అతికిరాతకంగా చంపి,ముక్కలు చేశాడు. కాగా ఢిల్లీ పోలీసులు ఆయన్ని నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అఫ్తాబ్ నుంచి హత్యకు సంబంధించిన  వివరాలు రాబట్టేందుకు పోలీసులు అతన్ని అన్ని కోణాల్లో విచారించారు. విచారణలో భాగంగా అఫ్తాబ్‌కు నార్కో,పాలీగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ విచారణలో అఫ్తాబ్ వెల్లడించిన వివరాల ఆధారంగా..మెహ్రలీ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మానవ అవశేషాలను గుర్తించారు. అయితే అవి శ్రద్దావాకర్‌వే అని ఇటీవల నిర్దారణ అయ్యింది. అయితే శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలతో ఇవి సరిపోలాయి. అంతేకాకుండా నిందితుడు అఫ్తాబ్ ఇంట్లో గుర్తించిన రక్తనమూనాలు కూడా శ్రద్ధా వాకర్‌వే అని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.