భారత్‌లో విలీనం చేయమంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనలు
తాము ఇకపై పాక్‌తో వేగలేమని, తమను భారత్‌లో కలిపేయమంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్- బాల్టిస్థాన్‌లో స్థానికులు ఆందోళనలు చేపట్టారు. తమకు తిండి కూడా కరువవుతోందని, పాలు, బియ్యం, గోధుమలు, అన్నీ ఆకాశానికి తాకుతున్నాయని విలవిల్లాడుతున్నారు. శ్రీలంక లాగే పాకిస్థాన్‌లో కూడా ఆర్థిక మాంద్య ప్రభావంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో పాకిస్తానీయులే అక్కడ ఉండలేకపోతున్నారు. తమ రాష్ట్రాన్ని లడఖ్‌లోని భారత్‌తో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ రోడ్డును తెరిచి, తమ తోటి బాల్టిన్‌లతో తమను ఉండనివ్వమని వేడుకుంటున్నారు. ఈ జనవరి 6 నుండి వారి నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమ ప్రాంతం పట్ల పాకిస్తాన్ వివక్ష చూపుతోందని వారు ఆరోపిస్తూ ర్యాలీలు చేస్తున్నారు.

