Home Page SliderTelangana

సంక్రాంతి రద్దీతో రైల్వే కౌంటర్లు పెంపు

హైదరాబాద్‌లో నివసించే వారిలో చాలామంది ఆంధ్రవారే. ఆంధ్రుల పెద్దపండుగైన సంక్రాంతికి వారి సొంతూళ్లకు వెళ్లడానికి ఉబలాటపడుతూంటారు. అందుకే పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఏకంగా 21 టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉంటాయి. వీటికోసం అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటుచేశారు. టిక్కెట్ తనిఖీ చేయడానికి కూడా ఉద్యోగులను రెట్టింపు చేశారు. రైళ్లు ఏఫ్లాట్‌ఫామ్‌కు వస్తాయో ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. ప్రయాణీకుల భద్రత, సహాయం కోసం  60 మంది RPF, 30 మంది GRP సిబ్బందిని విధులలో ఉంచారు. ఇంకా ఫ్లాట్‌ఫామ్‌పై రద్దీని తగ్గించడానికి కొన్ని MMTC రైళ్లను కూడా 13,14  తేదీలలో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.