Andhra PradeshHome Page SliderPolitics

పోత్తులతోనే రాజకీయాలు… మీ నాన్నతో పోరడా… నువ్వెంత!

తన చివరి శ్వాస వరకు రాజకీయాలకు వదిలిపెట్టనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు పవన్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట జనసేన ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. మనల్ని ఎవడ్రా ఆపేది… అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అభిమానులు, కార్యకర్తలు సభలో కేకలు, నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తనను పార్ట్‌ టైం పొలిటీషియన్‌ అనేవారికి పవన్‌ కౌంటరిచ్చారు. అసలు దేశంలో ఎవరైనా ఫుల్‌ టైం రాజకీయనేతగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

చాలామంది వ్యాపారాలు, తమ వృత్తిని కొనసాగిస్తూనే రాజకీయాలు చేస్తున్నారని గుర్తు చేశారు. తాను కూడా అలాగే చేస్తున్నానని అన్నారు. ప్రజల కోసమే తాను పలువురు నేతలతో తిట్లు తింటున్నానని పవన్‌ స్పష్టం చేశారు. సీఎం జగన్‌ మూడు ముక్కల ముఖ్యమంత్రి అని విమర్శించారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతున్న వారు.. అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ డిమాండ్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలు ఈసారి జనసేనకు అండగా లేకపోతే వారికి ఎవరూ కాపాడలేరన్నారు. వైఎస్ తోనే పోరాడానని… జగన్ ఎంత అని పవన్ ప్రశ్నించారు.

దేశాల సంపద కలల ఖనిజాలతో చేసిన యువత అన్నారు పవన్ కల్యాణ్…  యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తామన్నారు. నాయకులు వాళ్ల గురించి.. వాళ్ల బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. తను సగటు మధ్యతరగతిలో తాను కూడా సామాన్యుడేనన్నారు. తనకు ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రత్యేకమైన సంబంధం ఉంది. గతంలో ఒనమాలు నేర్చుకున్నా.. ఉత్తరాంధ్ర కళ తెలుసు. నటన నేర్పించింది కూడా ఉత్తరాంధ్ర జనమే. రాజకీయ సామాజిక చైతన్యం నేర్పించిన నేల ఉత్తరాంధ్ర అన్నారు. చైతన్యం వచ్చింది ఉత్తరాంధ్ర నుండే అన్నారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్నారు. తిట్టడానికి ఈ సభ నిర్వహించలేదన్నారు. సగటు మనిషి ఆలోచన. నాకు కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి నాకెందుకు రావని యువత ఆలోచిస్తోందని పవన్‌ పేర్కొన్నారు. “కష్టం వస్తే ఎందుకు ఈ వ్యవస్థలు పనిచేయవని బాధపడతారు. మహనీయుల త్యాగాలు బాధ్యతలు తెలియజేశాయి. దేశభక్తి కలిగించింది. కష్ట జీవులకు అండగా ఉండమని చెప్పింది. సినిమాల్లో నా అనుక్షణం మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి అని చెప్పారు. ఉద్యోగం, ఉపాధి లేని యువత గురించి ఆలోచించింది.

నా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వాస్తవంగా చెప్పాలంటే నా గురించి తొలిప్రేమ నుంచి ఖుషీ వరకు చేశాను. నాకు కోరికలు లేవు. ఖుషీ తర్వాత ఇంతకు మించి పెద్ద స్టార్ అవ్వొచ్చేమో అనుకున్నా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగొచ్చనుకున్నా.. నాలో ఉన్న అశాంతి నాకు అర్థం కాలేదు. నేను సాధించిన విజయాలకు సంతోషం లేదు. మనసు ఎప్పుడూ బాధల్లో ఉన్నోళ్ల పట్ల ఉంది. ఆ కష్టమే నన్ను ఆనందంగా ఉండనీయలేదు.”

“ప్రతి వెదవ చేత, సన్నాసి చేత మాట అన్పించుకుంటుంటే నిజంగా బాధలేదు. ఇలాంటి సన్యాసులను అన్పించకుండా బతికేయగలను. రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది ఫోటోలు తీయించుకున్నారు. ప్రజల పక్షాన పోరాడి తిట్టించుకోవడం నాకు విజయమే. కేవలం మన కోసం జీవించే జీవితం కంటే సాటి మనిషి కోసం జీవించే జీవితం పెద్దది. సామాజిక బాధ్యతలు గురించి చెప్పిన రాజకీయనేతలు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అధికారంలో కూర్చోగానే మనం బానిసల్లా చూసే వ్యక్తిత్వాలు చిరాకు కలిగించాయి. సినిమాల్లో రెండున్నర గంటల్లో తీర్చొచ్చు.. నిజ జీవితంలో కష్టాలు తీర్చలేం. విభజన జరిగిన తీరు చూసి పార్టీ పెట్టినప్పడు నా దగ్గర ఎవరూ లేరు. ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చా.. ఒక సత్యాన్ని బలంగా మాట్లాడినవాడినవుతాను. పిరికితనం చిరాకు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా… యువతలో కోపం ఉంది. భయం ఉంది. రాజకీయ నాయకులు ఏమైనా దిగొచ్చారా.. మనలాగానే రక్తమాంసాలే ఉన్నాయి. మనకు దెబ్బతగిల్నట్టే వాళ్లకు దెబ్బ తగులుతుంది.”

ఉత్తరాంధ్ర పోరాటగడ్డ.  ఇది కళింగ ఆంధ్ర కాదు.. కలియబడే ఆంధ్ర.. మీరు కామ్ గా ఉండటం కరెక్ట్ కాదు. ఉపాధి లేనప్పుడు గొంతు ఎత్తాలి కదా.. ఎందుకు వలస వెళ్లాలని నాయకులను నిలదీయకపోతే ఎలా… గిడుగు రామ్మూర్తి  వాడుక భాష, జీవితం ఎదుర్కోవాలన్న శ్రీశ్రీ మహాప్రస్థానం.. కార్మికులకు అండగా నిలిచిన శ్రీశ్రీ, రావిశాస్త్రి.. సగటు మనిషి మధ్య కదలికలు రాశారు. చాగంటి సోమయాజులు చెప్పినవి చదివి నేను మాట్లాడుతున్నా… శ్రీకాకుళం నేల గొప్పతనం గిడుగు రామ్మూర్తి గారిని చూస్తే తెలుస్తుంది. రాజకీయనేతలు దోచేయడం ఈ రోజుది కాదు.. గిడుగు కాలం నుంచే ఉందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.