వాడొక వెధవ.. వర్మపై నాగబాబు ఫైర్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు గట్టిగా కౌంటరిచ్చారు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ ఇచ్చారా?అంటూ తీవ్రంగా నాగబాబు మండిపడ్డారు. ఒక్క సినిమాకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్‌కు ప్యాకేజీ అవసరమా అని ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడని, అతనొక వెధవ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టే తమకు లేదన్నారు. యువతీ యువకుడు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేయగలిగిలే జనసేన పార్టీ క్రియేట్ చేయగలిగిందన్నారు. ఇప్పటివరకు యువత ఆలోచనలు, అభిప్రాయాలు సోషల్ మీడియా వరకే పరిమితమయ్యాయని నాగబాబు పేర్కొన్నారు.

